అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాల అందజేత
గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న లంకా సూర్యనారాయణకు రెండు సినిమా పుస్తకాలను సెంట్రల్ ఎక్సైజ్ పింఛనర్ల సంఘం బహూకరించింది. బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య గ్రంథాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ పింఛనర్ల సంఘ నేత గుమ్మడి సీతారామయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్, కథానాయిక ఎల్.విజయలక్ష్మిలపై కొత్తగా ప్రచురించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ అరుదైన ఛాయాచిత్రాలు, నేటితరానికి తెలియని ఎల్. విజయలక్ష్మి సినీ జీవిత గాథ ఈ పుస్త కాల ప్రత్యేకత అన్నారు. పుస్తక రూపకర్తలు చిన్ని శ్రీను (రాజమండ్రి), కంపల్లె రవిచం ద్రన్ (తిరుపతి) కోరిక మేరకు పుస్తక తొలి ప్రతులను అన్నమయ్య గ్రంథాలయానికి అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెంట్రల్ ఎక్సైజ్ పించనర్ల సంఘ నాయకులు టి. వివేకానంద, పీవీ సత్యనారా యణ, పి. కోటేశ్వరరావు, గ్రంథపాలకురాలు సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి