ధర్మబద్ధ రాజకీయ నాయకుడిలా ఉన్నా - శోభనాద్రీశ్వరరావు
'రైతు జన నేతగా, ప్రజానాయకుడిగా
నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ధర్మబద్ధ రాజకీయ నాయకుడు ఎలా. ఉండాలో అలా
ఉన్నాను' అని మాజీ మంత్రి
వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి
దేవాలయంలో స్వధర్మ సేవా సంస్థ శనివారం రాత్రి ఆయనకు ధర్మజ్యోతి పురస్కారం ప్రదానం
చేసి సత్కరించింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు పరంగా లాండ్ సీలింగ్
యాక్ట్ తదితర సందర్భాల్లో వచ్చిన సమస్యలను దిల్లీ నాయకులతో చర్చించి
పరిష్కరించినవి అనేకం ఉన్నాయన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఇంటికి వచ్చిన
వారందరికీ తన భార్య ఆతిథ్య మిచ్చి తనకు మంచి పేరు తెచ్చిపెట్టినట్లు వివరించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్
యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రాన్రాను యువత వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ పరిస్థితి మారాలన్నారు. రైతు కుంటుంబం నుంచి
ఢిల్లీ వరకు వెళ్లి పదవులు చేప ట్టిన వారు కూడా రైతుకు మేలు చేసేలా చట్టాలు
తేలేకపోవడం విచారకరమన్నారు. గౌతు లచ్చన్న తదితర నాయకుల అడుగు జాడల్లో
నడిచిన వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు మాత్రం శక్తికొద్దీ పోరాడుతున్నారని.
అలాంటి ఆదర్శ నాయకులు రావాలన్నారు. స్వధర్మ సేవా సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి
రామారావు సభకు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్
నన్నపనేని రాజకుమారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ,
భారతీ దార్మిక విజ్ఞాన
పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కార్యదర్శి
బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి,
సంస్థ కార్యదర్శి తూనుగుంట్ల సుందరరామయ్య, దేవినేని కరుణచంద్రబాబు, చంద్రమౌళి, పావులూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని శోభనాధీశ్వరావును ధర్మజ్యోతి పురస్కారంతో సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి