శివరాత్రి చండీహోమం ప్రారంభం
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం చండీహోమాన్ని ప్రారంభించారు. పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల నిర్వహణలో గణపతి, శివలింగం, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చ నలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి హోమద్రవ్యాలతో హోమ పూర్ణాహుతి నిర్వహించారు. అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త గుదిమెళ్ల శ్రీకూ ర్మనాథస్వామి మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజ యబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటు కూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
🕉️ మహాశివరాత్రి శుభాకాంక్షలు 🔱
రిప్లయితొలగించండి