అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు - గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 16.10.2025
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు కిమ్స్ హాస్పటల్స్ వారి సంయుక్త నిర్వహణలో ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. డా. కొల్లి జయకిషన్ MS ORTHO FIJR ( జర్మనీ & సింగపూర్ ) చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, డా . MLV సాయి కృష్ణారెడ్డి MS ఆర్థో ( జిప్మెర్) కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ గార్లచే ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై సలహాలు, సూచనలను తెలియజేశారు.