నిషాధ రాజ్యానికి రాజు నలుడు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై ప్రబంధ సాహిత్యం - ఆధ్యాత్మికం ప్రవచనాల్లో భాగంగా మంగళవారం నలోపాఖ్యానంలోని హంస-నలుని వృత్తాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయ బాబు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రసంగిస్తూ నలుడు నిషాధ రాజ్యానికి రాజని అన్నారు. ఆయన దమయంతి అనే విదర్భ యువరాణిని వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఒకరోజు నలుడు తన తోటలో విహరిస్తుండగా, ఆయన ఒక అందమైన హంసను పట్టుకున్నాడని తెలిపారు. ఆ హంస మానవ భాషలో మాట్లాడిందని అన్నారు. నలుని వద్దకు దమయంతి వద్దకు రాయబారంగా వెళ్లి, ఆమెకు నలుని గురించి చెప్పిందన్నారు. ఆ తర్వాత, దమయంతి స్వయంవరంలో నలుడు, దమయంతిని ఎంచుకున్నాడని హంస- నలుని వృ ంత్తాంతాన్ని విపులంగా వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి