అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న వాగ్గేయ కార సంగీత, నృత్య ఉత్సవాలు ఆదివారంతో ముగి శాయి. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వ ర్యంలో జరగ్గా, చిగురుపాటి కమల జ్యోతిప్రజ్వల నతో ప్రారంభించారు. స్థానిక కళాకారులు వాగ్గేయ కార కీర్తనల గానం చేశారు. బీవీఎన్.ప్రణతి, వైష్ణవి తోడి ఆడిటల వర్ణంతో ప్రారంభించి అన్నమయ్య కీర్తనలను, డి.లలిత, రాజ్యలక్ష్మీ భైరవి ఆది తాళ వర్ణం ఉత్తుక్కాడు వెంకట సుబ్బయ్యర్ ఎన్.సి. కృష్ణ మాచార్య కృతులను అలపించారు. సాయంత్రం కార్యక్రమాలను రేడియాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ సుజాత, డాక్టర్ జె.నరేష్బాబు, విశ్రాంత అధ్యా పకులు ఎన్. తిరుపతయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సంగీత రత్నమణి పద్మశ్రీ శ్రీనివాసన్ (చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో సన్మండలి అధ్యక్షు రాలు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై.శే షురాని, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజ యలక్ష్మి పాల్గొనగా, అనంతరం కళాకారులను, అతి థులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి