శ్రీమద్భగవద్గీత ప్రవచనములు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం శ్రీమద్భగవద్గీత అష్టాదశ మోక్షసన్యాసయోగంపై అధ్యాత్కిర ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నయ బ్రహ్మచారి సన్యాన సువీరానంద స్వామి ప్రవచిస్తూ మోక్షసన్యాసయోగంలో తత్తము, త్యాగతత్త్వము గూర్చి తెలియజేస్తూ పుత్ర ధనాది ప్రియ వస్తు ప్రాప్తికి, రోగములు మొదలగు వాటిని నివృత్తికి చేసే ఉపాసనలను సన్యాసమని, సర్వకర్మ ఫలములను తృజించుటను త్యాగమని అంటారన్నారు. సన్మానము త్యాగము అనే రెండు విషయాలని, త్యాగము సాత్వికము, రాజనము, తామసము అని మూడు విధాలుగా చెప్పబడ్డాయన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి