వాగ్గేయకార సంగీత, నృత్య ఉత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్‌గార్డెన్స్‌లో శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో వాగ్గేయకార సంగీత, నృత్య ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించనున్న ఉత్సవాలను డాక్టర్ వి.రాధిక జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం కళాకారులతో వాగ్గేయకార కీర్తనల గానం నిర్వ హించారు. డాక్టర్ కె. మృణాళిని, ఎం.మాధవికృ ష్ణ కల్యాణ రాగవర్ణం, క్షేత్రయ్య పదం, జావళి, ఎంవై. శేషురాణి సావేరి వర్ణం, సీతారామారావు రాగమాలిక శ్రావ్యంగా గానం చేశారు. పలువురు కళాకారులు వాగ్గేయకార కీర్తనలను ఆలపించారు. సాయంత్రం నృత్య కార్యక్రమాలను అదనపు సొలిసిటర్ జనరల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ చల్ల ధనుంజయ, రేడియాలజిస్ట్ డాక్టర్ జి.జాహ్నవి జ్యోతి ప్రజ్వలన చేశారు. వాగ్గేయకార వైభవం నృత్యాన్ని ప్రారంభించారు. నాట్యమయూరి డాక్టర్ బిందుఅభినయ్, శిష్య బృందం నృత్యాభినయం చేయగా అలరించింది. కార్యక్రమంలో సన్మండలి అధ్యక్షులు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై. శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరా జేశ్వరి, లలితదేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ.మం గాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతిథులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి