ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ - 23.10.2025

ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు గ్రంథావిష్కరణ సభ   ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత సంగ్రహంపై డాక్టర్ వెన్ని శెట్టి సింగారావు వ్రాసిన గ్రంథా విష్కరణ సభ ఈ నెల 26 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై జరుపుతున్నట్లు భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లెపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు . ఆదివారం ఉదయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ సభకు రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ అధ్యక్షత వహిస్తారని , జ్యోతి ప్రకాశనం దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య చేస్తారని , విశిష్ట అతిథి పూర్వ పార్లమెంటు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి , శాసనమండలి పూర్వ సభ్యులు కే ఎస్ లక్ష్మణరావు గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు . ఆత్మీయ అతిథులుగా డాక్టర్ సీతారామయ్య పారిశ్రామికవేత్త పోలిశెట్టి జ్ఞానదేవ్ , సరస్వతి శిశు మందిరాల జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు , ఏప...

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన గానం - 25.09.2025

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన గానం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగిన అన్నమాచార్య సంకీర్తన గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళా శాల, తితిదే సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తితిదే ఆస్థాన గాయకుడు ఎం.రవి చంద్ర కచేరీలో పలు అన్నమాచార్య విరచిత సంకీర్తనలను శ్రావ్యంగా గానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ ఆర్.రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కల్చరల్ సెంటర్ గౌరవాధ్యక్షుడు వీజే వినయ్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని నాగార్జున సాంస్కృతిక కేంద్రం, సంగీత కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సూర్యనారాయణ నిర్వహించారు. పీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎం.ఎస్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

శక్తి స్వరూపిణీ.. నమోస్తుతే - 25.09.2025

శక్తి స్వరూపిణీ.. నమోస్తుతే శ్రీదేవి శరవన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరు నగరంలో వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు గురువారం పలు దేవాలయాల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా,  కాత్యాయనిగా, ధనలక్ష్మిగా, రాజరాజేశ్వరిగా, కంచి కామక్షిదేవిగా, లలితదేవిగా, మంగళగౌరి దేవిగా అలంకరించారు

శ్రీ దుర్గాస్తుతి విశిష్టతపై ప్రవచనం - 24.09.2025

శ్రీ దుర్గాస్తుతి విశిష్టతపై ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదిక పై మంగళవారం శ్రీ దుర్గాస్తుతి పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఉపనిషన్మందిరం సభ్యులు శ్రీ నిష్ఠల నరసింహమూర్తి ప్రవచిస్తూ 'దుర్గా' నామము యొక్క విశిష్టత లౌకిక ముగాను, పారమార్థికముగాను వివరిస్తూ దుఃఖేనాధి గంతుమ్ శక్యతా ఇతి దుర్గ ఎంతో కష్టం మీద కానీ గ్రహించలేనిదన్నారు. పరమాత్మ మాయా శక్తి దుర్గయని, మనోవాచా అగోచరమైనది దుర్గయని పోతన చెప్పిన పద్యములో ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ అని వివరించారు. శరన్నవరాత్రుల యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తూ మనలో ఉండే పంచ కోశాలు, మనసు, ప్రాణము, బుద్ధి, జీవభావమన్నారు. సాధన ద్వారా మనలో అజ్ఞానం తొలగించు కోవడం మహిషాసుర మర్దనము, రాగద్వేషాలు రూపుమాపడమే శుంభ, నిశుంభుల సంహార మన్నారు. అమ్మవారి అనుగ్రహంతో నవావరణలు దాట డమే నిజమైన విజయదశమి అని తెలియజేశారు. భార తాంతర్గతము అయిన అర్జునకృత శ్రీ దుర్గాస్తుతి సంద ర్భము నామములు వివరణలను భగవత్ భక్తులకు సవి వరంగా తెలియజేశారు.

వేదమాత గాయత్రి ప్రాణరక్షధాత్రి - 23.09.2025

వేదమాత గాయత్రి ప్రాణరక్షధాత్రి శరన్నవరాత్రుల వేళ నగర దేవాలయాలన్నీ అమ్మవారి విశేష అలంకారాలతో కళకళలాడుతు న్నాయి. రెండో రోజు మంగళవారం అధికశాతం ఆలయాల్లో లోకజనని గాయత్రీ మాతగా దర్శనమిచ్చింది. మరికొన్ని ఆలయాల్లో వార విశేషాన్ని అనుసరించి మంగళగౌరి అలంకారం చేశారు. ఆలయాల సంద ర్శనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివ చ్చారు. దేవీ ఖడ్గమాల, శ్రీసూక్తం, లలితా సహస్రనామ తదితర పారాయణలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి.

ఏ పంజరానికి చిక్కని విశ్వనరుడు గుర్రం జాషువా - 22.09.2025

ఏ పంజరానికి చిక్కని విశ్వనరుడు గుర్రం జాషువా సాహితి సేవలో ఏ పంజరానికి చిక్కకుండా తానకు తానుగా విశ్వనరుడుగా ప్రక టించుకున్న గొప్ప పండితుడు గుర్రం జాషువా అని అనంత పురం తెలుగు శాఖ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సహాయ ఆచార్యులు, శాఖాధ్యక్షులు డాక్టర్ గరికపాటి గురజాడ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం జాషువా కళాపీఠం అధ్యక్షుడు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు ఆధ్వర్యంలో మహాకవి జాషువా 130వ జయంతి వారోత్సవాల సభ జరిగింది. గురజాడ ప్రసంగిస్తూ దేశభక్తి, దైవభక్తితో పాటు సామాజిక దృష్టిలో జాషువా రచనలు కొనసాగించారన్నారు. సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ ప్రతి ప్రశ్నకు సమాధానం జాషువా పద్యాల్లో గోచరిస్తాయని అన్నారు. అనంతరం ప్రముఖ కవులు కోయి కోటేశ్వరరావు, రసరాజు, అనిల్ డ్యానియల్, గరికపాటి గురజాడ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్ చైర్మన్ డి.రాములు, విశ్రాంత డి.ఐ.జి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ చావలి బాలస్వామి, ఆలయ కమిటి అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య, కవి దేవరపల్లి ప్రభుదాస్, సాహితీ పరిశోధకులు పారా అశోక్ తదితరులు పా...

వైభవంగా దసరా మహోత్సవాలు ప్రారంభం - 22.09.2025

వైభవంగా దసరా మహోత్సవాలు ప్రారంభం శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గుంటూరు పశ్చిమలో వైభవంగా ప్రారభమయ్యాయి. అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చారు. పలుచోట్ల అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అలరించిన వేణుగానం, గాత్ర కచేరి - 21.09.2025

అలరించిన వేణుగానం, గాత్ర కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం వేణుగానం, గాత్ర కచేరి నిర్వహించారు. స్వర తరంగిణి విద్యాల యం(గుంటూరు) ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమారెళ్ళ వామనకుమార్ పలు కీర్తనలను వేణు గానంతో పలికించారు. ప్రేక్షకులను అలరించాయి. సువర్ణవిద్య శిష్య బృందం వాగ్గేయకార కీర్తనలను అలపించారు. వయోలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్యాన్ని అందించారు.

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం - శ్రీమాన్ గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి - 18, 19.09.2025

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మాపతి కళ్యాణవేదికపై గురువారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యా త్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారతంలోని అరణ్య పర్వంలో తీర్థయాత్రలు చేస్తున్న ధర్మరాజుకు అగస్త్య మహర్షి వాతాపి ఇల్వల వృత్తాంతాన్ని తెలిపారన్నారు. ఇల్వడు తన సోదరుడైన వాతాపిని ఒక పెద్ద గేదెగా మార్చి అగస్త్య మహర్షికి ఆహారంగా వడ్డిస్తాడన్నారు. అగస్త్యుడు తన కోపంతో వాతాపిని మింగివేసి, ఇల్వలను కూడా సంహరిస్తాడన్నారు.

నాగరాజ్యలక్ష్మి సాహితీ కృషి అభినందనీయం - 17.09.2025

నాగరాజ్యలక్ష్మి సాహితీ కృషి అభినందనీయం నిరంతర పఠనం చక్కని విమర్శకు దోహద పడుతుందని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర దేవాలయంలోని పద్మావతి కల్యాణ వేదికపై డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన సమీక్షా సౌరభాలు పుస్తకాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ నాగరాజ్యలక్ష్మి ప్రాచీన, ఆధునిక సాహిత్య రంగాల్లో ప్రజ్ఞావంతురాలని, అందువల్లే తెలుగులో మంచి విమర్శనాత్మక వ్యాసాలు రాయగలిగారన్నారు. ఏఎన్ఐయూ పూర్వ రిజిస్ట్రారు రావెల సాంబశివరావు మాట్లాడుతూ రచయిత్రి నిరంతర సాహితీ కృషి అభినందనీయమన్నారు. గ్రంథ సమీక్ష చేసిన డాక్టర్ బీరం సుందరరావు మాట్లాడుతూ కవయిత్రిగా రచయిత్రిగా, విమర్శకు రాలిగా, వ్యాఖ్యాతగా నాగరాజ్యలక్ష్మి అపార మైన కృషి కొనసాగిస్తున్నారని కొనియాడారు. సభకు డాక్టర్ టి. రాధాబాయి అధ్యక్షత వహించారు. డాక్టర్ రావి రంగారావు, పాపి నేని శివశంకర్ తదితర సాహితీ ప్రముఖులు, డాక్టర్ మైలవరపు లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి - 16.09.2025

ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాయవరం సంపూర్ణ రాజ్యలక్ష్మి గాత్ర కచేరీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు గుళ్ల పల్లి సుబ్బారావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎం.వై శేషురాణి, సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

సైబర్ మోసాలపై అవగాహన ఉండాలి - 15.09.2025

సైబర్ మోసాలపై అవగాహన ఉండాలి దేశ వ్యాప్తంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు బాగా పెరి గాయని, వీటి నివారణకు బ్యాంకు ఖాతాదారులు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉందని, ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ అని ఆన్లైన్ ఫోన్లు చేసిన వాటిని నమ్మవద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీ కోర్ సీఐ సమీర్ బాషా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరిగి మీ ఖాతాలలో డబ్బులు పోయినట్లు గుర్తిం చిన వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పట్టాభిపురం ఎస్ఐ తరం గిణి, ప్రదీప్ పాల్గొన్నారు.

కళలతో విశ్వవ్యాప్త ఖ్యాతి - 12,13,14.09.2025

కళలతో విశ్వవ్యాప్త ఖ్యాతి సంగీతం, నృత్యం లాంటి కళలతో ఎవరైనా విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించవచ్చని శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. కేఆర్కేఎం మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణ వేదికపై అమరా వతి నాట్యోత్సవాలు-2025 రెండో రోజు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకురాలు కోకా విజయలక్ష్మి సంగీత, నృత్య రంగాల్లో చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సభానంతరం చిన్నారులు, యువనర్తకుల కూచిపూడి నృత్య ప్రదర్శ నలు జరిగాయి. గజల్ శ్రీనివాస్, డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం, వెలివేటి మురళి, అభినయ థియేటర్ ట్రస్ట్ అభినయ శ్రీనివాస్, ఆలయపాలక మండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోకా విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు.