నాగరాజ్యలక్ష్మి సాహితీ కృషి అభినందనీయం
నిరంతర పఠనం చక్కని విమర్శకు దోహద పడుతుందని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర దేవాలయంలోని పద్మావతి కల్యాణ వేదికపై డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన సమీక్షా సౌరభాలు పుస్తకాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ నాగరాజ్యలక్ష్మి ప్రాచీన, ఆధునిక సాహిత్య రంగాల్లో ప్రజ్ఞావంతురాలని, అందువల్లే తెలుగులో మంచి విమర్శనాత్మక వ్యాసాలు రాయగలిగారన్నారు. ఏఎన్ఐయూ పూర్వ రిజిస్ట్రారు రావెల సాంబశివరావు మాట్లాడుతూ రచయిత్రి నిరంతర సాహితీ కృషి అభినందనీయమన్నారు. గ్రంథ సమీక్ష చేసిన డాక్టర్ బీరం సుందరరావు మాట్లాడుతూ కవయిత్రిగా రచయిత్రిగా, విమర్శకు రాలిగా, వ్యాఖ్యాతగా నాగరాజ్యలక్ష్మి అపార మైన కృషి కొనసాగిస్తున్నారని కొనియాడారు. సభకు డాక్టర్ టి. రాధాబాయి అధ్యక్షత వహించారు. డాక్టర్ రావి రంగారావు, పాపి నేని శివశంకర్ తదితర సాహితీ ప్రముఖులు, డాక్టర్ మైలవరపు లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి