సైబర్ మోసాలపై అవగాహన ఉండాలి
దేశ వ్యాప్తంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు సైబర్ మోసాలు బాగా పెరి గాయని, వీటి నివారణకు బ్యాంకు ఖాతాదారులు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉందని, ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ అని ఆన్లైన్ ఫోన్లు చేసిన వాటిని నమ్మవద్దని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీ కోర్ సీఐ సమీర్ బాషా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరిగి మీ ఖాతాలలో డబ్బులు పోయినట్లు గుర్తిం చిన వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పట్టాభిపురం ఎస్ఐ తరం గిణి, ప్రదీప్ పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి