ఏ పంజరానికి చిక్కని విశ్వనరుడు గుర్రం జాషువా
సాహితి సేవలో ఏ పంజరానికి చిక్కకుండా తానకు తానుగా విశ్వనరుడుగా ప్రక టించుకున్న గొప్ప పండితుడు గుర్రం జాషువా అని అనంత పురం తెలుగు శాఖ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సహాయ ఆచార్యులు, శాఖాధ్యక్షులు డాక్టర్ గరికపాటి గురజాడ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం జాషువా కళాపీఠం అధ్యక్షుడు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు ఆధ్వర్యంలో మహాకవి జాషువా 130వ జయంతి వారోత్సవాల సభ జరిగింది. గురజాడ ప్రసంగిస్తూ దేశభక్తి, దైవభక్తితో పాటు సామాజిక దృష్టిలో జాషువా రచనలు కొనసాగించారన్నారు. సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ ప్రతి ప్రశ్నకు సమాధానం జాషువా పద్యాల్లో గోచరిస్తాయని అన్నారు. అనంతరం ప్రముఖ కవులు కోయి కోటేశ్వరరావు, రసరాజు, అనిల్ డ్యానియల్, గరికపాటి గురజాడ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్ చైర్మన్ డి.రాములు, విశ్రాంత డి.ఐ.జి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ చావలి బాలస్వామి, ఆలయ కమిటి అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య, కవి దేవరపల్లి ప్రభుదాస్, సాహితీ పరిశోధకులు పారా అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి