అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి
బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాయవరం సంపూర్ణ రాజ్యలక్ష్మి గాత్ర కచేరీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు గుళ్ల పల్లి సుబ్బారావు, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎం.వై శేషురాణి, సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి