సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
వేదమాత గాయత్రి ప్రాణరక్షధాత్రి
శరన్నవరాత్రుల వేళ నగర దేవాలయాలన్నీ అమ్మవారి విశేష అలంకారాలతో కళకళలాడుతు న్నాయి. రెండో రోజు మంగళవారం అధికశాతం ఆలయాల్లో లోకజనని గాయత్రీ మాతగా దర్శనమిచ్చింది. మరికొన్ని ఆలయాల్లో వార విశేషాన్ని అనుసరించి మంగళగౌరి అలంకారం చేశారు. ఆలయాల సంద ర్శనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివ చ్చారు. దేవీ ఖడ్గమాల, శ్రీసూక్తం, లలితా సహస్రనామ తదితర పారాయణలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి