శ్రీ దుర్గాస్తుతి విశిష్టతపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదిక పై మంగళవారం శ్రీ దుర్గాస్తుతి పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఉపనిషన్మందిరం సభ్యులు శ్రీ నిష్ఠల నరసింహమూర్తి ప్రవచిస్తూ 'దుర్గా' నామము యొక్క విశిష్టత లౌకిక ముగాను, పారమార్థికముగాను వివరిస్తూ దుఃఖేనాధి గంతుమ్ శక్యతా ఇతి దుర్గ ఎంతో కష్టం మీద కానీ గ్రహించలేనిదన్నారు. పరమాత్మ మాయా శక్తి దుర్గయని, మనోవాచా అగోచరమైనది దుర్గయని పోతన చెప్పిన పద్యములో ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ అని వివరించారు. శరన్నవరాత్రుల యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తూ మనలో ఉండే పంచ కోశాలు, మనసు, ప్రాణము, బుద్ధి, జీవభావమన్నారు. సాధన ద్వారా మనలో అజ్ఞానం తొలగించు కోవడం మహిషాసుర మర్దనము, రాగద్వేషాలు రూపుమాపడమే శుంభ, నిశుంభుల సంహార మన్నారు. అమ్మవారి అనుగ్రహంతో నవావరణలు దాట డమే నిజమైన విజయదశమి అని తెలియజేశారు. భార తాంతర్గతము అయిన అర్జునకృత శ్రీ దుర్గాస్తుతి సంద ర్భము నామములు వివరణలను భగవత్ భక్తులకు సవి వరంగా తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి