మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మాపతి కళ్యాణవేదికపై గురువారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యా త్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారతంలోని అరణ్య పర్వంలో తీర్థయాత్రలు చేస్తున్న ధర్మరాజుకు అగస్త్య మహర్షి వాతాపి ఇల్వల వృత్తాంతాన్ని తెలిపారన్నారు. ఇల్వడు తన సోదరుడైన వాతాపిని ఒక పెద్ద గేదెగా మార్చి అగస్త్య మహర్షికి ఆహారంగా వడ్డిస్తాడన్నారు. అగస్త్యుడు తన కోపంతో వాతాపిని మింగివేసి, ఇల్వలను కూడా సంహరిస్తాడన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి