కళలతో విశ్వవ్యాప్త ఖ్యాతి
సంగీతం, నృత్యం లాంటి కళలతో ఎవరైనా విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించవచ్చని శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. కేఆర్కేఎం మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణ వేదికపై అమరా వతి నాట్యోత్సవాలు-2025 రెండో రోజు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకురాలు కోకా విజయలక్ష్మి సంగీత, నృత్య రంగాల్లో చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సభానంతరం చిన్నారులు, యువనర్తకుల కూచిపూడి నృత్య ప్రదర్శ నలు జరిగాయి. గజల్ శ్రీనివాస్, డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం, వెలివేటి మురళి, అభినయ థియేటర్ ట్రస్ట్ అభినయ శ్రీనివాస్, ఆలయపాలక మండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోకా విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి