ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తన గానం
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగిన అన్నమాచార్య సంకీర్తన గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళా శాల, తితిదే సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తితిదే ఆస్థాన గాయకుడు ఎం.రవి చంద్ర కచేరీలో పలు అన్నమాచార్య విరచిత సంకీర్తనలను శ్రావ్యంగా గానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ ఆర్.రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి నాగార్జున స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కల్చరల్ సెంటర్ గౌరవాధ్యక్షుడు వీజే వినయ్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని నాగార్జున సాంస్కృతిక కేంద్రం, సంగీత కళాశాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సూర్యనారాయణ నిర్వహించారు. పీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎం.ఎస్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి