పింగళి దేశభక్తి ఆదర్శనీయం
నట నాలయ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని సోమ వారం రాత్రి బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా వచ్చి పింగళి దేశభక్తి, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర, మువ్వన్నెల జెండా రూపొందించిన విధానం తదితరాలను వివరించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రామచంద్రరాజు... వెంకయ్య జీవిత విశేషాలు తెలిపారు. కార్యక్రమంలో తూములూరి రాజేంద్రప్రసాద్, కాలంగి వంశీకృష్ణ, అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు, కొల్లూరి శివప్రసాదరావు ప్రసంగిం చారు. తొలుత కార్యక్రమాన్ని దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ విశాఖ పట్నం వారు రేపటి శత్రువు నాటిక ప్రదర్శించారు.

.jpeg)

.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి