అలరించిన భక్తి గానలహరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం బెల్లంకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ చింతలపాటి గోపాలకృష్ణ జయంతి సందర్భంగా ఆదివారం జరిగిన భక్తి గానలహరి ప్రేక్షకులను అలరింపజేసింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీమణులు రమాగోపాలకృష్ణ, పావని, అంజనీ లు తమ గాత్రధారణలో పలువురు వాగ్గేయకారుల అరసినన్నుగాచిన, కలిగెనిదె నాకు కైవల్యము, ఇందరికి అభయమంబు లిచ్చు చేయి, విచ్చేయవమ్మా, వీధుల వీధుల అంటూ పలు అన్నమయ్య, నరసింహదాసు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. వయోలిన్‌పై పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి, తబలాపై పి. బాలాజీ వాయిద్య సహకారం అందించారు.
.jpeg)
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి