కనులపండువగా విప్రనారాయణ యక్షగానం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మూడు రోజులపాటు జరగనున్న నృత్య కిన్నెర-కూచిపూడి నృత్యోత్సవాలు శుక్రవారం ప్రారంభమ య్యాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యం లో కళా రత్న కాజా వెంకటసుబ్రహ్మణ్యం దర్శకత్వంలో విజయరాఘవనాయుడు రచించగా, సంగీతం కుమార సూర్యనారాయణ అందించగా విప్రనారాయణ చరితం యక్ష గానం ప్రదర్శన నిర్వహిం చారు. ప్రేక్షకులను అలరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించిన కుమార సూర్యనారాయణను అతిధులు, సంస్థ తరుపున సత్కరించారు. పి.త్రివిక్రమరావు, ఆం ధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, డీఎస్పీ గోలి లక్ష్మయ్య, పాలకమండలి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. కార్య క్రమంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాళి రఘురామ్, నిర్వాహ కులు పి.విజయకుమార్, కోశాధికారి కేవీ సుబ్బారావు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి