ఇహలోక సుఖాలు అశాశ్వతం
శరీరాలు, సంపదలు శాశ్వతం కాదని, ఈ రెండు శాశ్వతం కానప్పుడు వాటి నుంచి లభించే సుఖం కూడా శాశ్వతం కాదని ఆధ్యాత్మిక ప్రవచకులు కేవీ కోటేశ్వరరావు అన్నారు. బృందా వన్ గార్డెన్స్లోలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై రెండు రోజులుగా వ్యాస మహర్షి రచించిన విశ్వనాథాష్టకంపై నిర్వహించిన ప్రవచనాలు గురువారం ముగిశాయి. ఆలయ పాల కమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్య క్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ, సుఖానికి హేతువు, సుఖస్థానం భగవంతుడేనని అన్నారు. అనిత్యమైన వాటి కోసం జీవితాంతం శ్రమించినా శాశ్వత సుఖం లభించదన్నారు. ఆ జ్ఞానం కలిగినప్పుడు మనసు అనిత్యమైన వాటి నుంచి శాశ్వత మైన సుఖాన్ని ప్రసాదించే భగవంతుని వైపు తిరుగు తుందని చెప్పారు. పి. శివారెడ్డి, తూనుగుంట్ల సుం దరరామయ్య, వి. ఏకాంబరేశ్వరరావు, వి. అరు ణకుమారి, వలేటి అంకినీడు ప్రసాద్, బి. యశోద తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి