పద్మావతి బాలచంద్ర కళాకార పురస్కార ప్రధానోత్సవం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ పద్మావతి బాలచంద్ర ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం మంచా బాలచందర్రావు 6వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత పద్మావతి బాలచందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ రంగస్థలం నటుడు, దర్శకుడు ఎం. వి.ఎల్. నరసింహారావు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రముఖ రంగస్థల నటుడు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ,ప్రముఖ నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం, చింతల ఆనంద్, కే. శ్రీనివాస్, కే.శివ ప్రసాద్ రావు, మంచా కృష్ణమోహన్,ఎం గణేష్ తదితరులు పాల్గొని ప్రముఖ రంగస్థల నటుడు ఉప్పలపాటి సైదులు ను పద్మావతి బాలచంద్ర కళాకార పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు, నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రమణ్యం శిష్యబృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరోజ్ నాట్యమండలి ఆధ్వర్యంలో పల్నాటి యుద్ధం లోని రాయబార సన్నివేశాన్ని ప్రదర్శించారు.








కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి