సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)





శ్లో. శ్రీనివాస! నమ స్తుభ్యం
రిప్లయితొలగించండిశ్రియం దేహి దయామయ!
గుణ్టూరునగరస్థ! శ్రీ
బృన్దావనప్రియ! ప్రభో!