రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు
రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి