ముగిసిన అమరావతి నృత్యోత్సవాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో శ్రీ.కె. ఆర్.కె.ఎం. మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 10వ అమరావతి నృత్యోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రదర్శించిన కూచిపూడి, ఆంధ్ర నాట్యం, యజ్ఞసేన నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. అధితులుగా అభినయ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకులు అభినయ శ్రీనివాస్, వి.వి.ఐ.టి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఏపీ స్పెషల్ రెప్రజెంటైవ్,యూరోప్ జయ కుమార్ గుంటుపల్లి, చార్టెడ్ అకౌంట్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ నాట్యాచార్యులు హైదరాబాద్ కు చెందిన మహతి భిక్షు పలుకీర్తనలకు కూచిపూడి నృత్యం, హైదరాబాద్ కు చెందిన లోకచంద్రశేఖర్ రెడ్డి పలు పాటలకు ఆంధ్ర నాట్యాన్ని, హైదరాబాద్ కు చెందిన ఎం సురేంద్రనాథ్ డాక్టర్ బిజింద్ సురేంద్ర నాధులు యజ్ఞసేని వృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి