మానవజాతి మనుగడకు జ్ఞానాన్ని ఇచ్చింది సంస్కృతభాష
సంస్కృతం మానవజాతి మనుగడకు జ్ఞానాన్ని ఇచ్చి మానవుడు మాధవుడుగా రూపాంతరం చెందడానికి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయం పాలక సంస్థ డైరెక్టర్ నందివెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సంస్కృత భారతి నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం మహాకవి కాళిదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నందివెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతు పిపీలకం నుండి బ్రహ్మ పర్యాంతం ఉన్న ఈ సృష్టి తత్తవాన్ని సంస్కృతం తెలియజేస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సంస్కృత పండితులు డాక్టర్ దివి నరసింహ దీక్షితులు మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి సంస్కృత భారతీ బహుముఖంగా సంస్కృత సేవ చేస్తుందన్నారు. ప్రపంచమంతా 26వేల మంది కార్యకర్తలతో కోటి సంస్కృతం మాట్లాడే జనులను రూపొందించిందన్నారు. వక్తగా విచ్చేసిన సంస్కృత భారతి అఖిలభారత బాల కేంద్రం ప్రముఖ్ డాక్టర్ ఉపద్రక్ష వెంకటరమణమూర్తి కాళిదాసు రచించిన మేఘసందేశం కావ్యం జాతీయ స్ఫూర్తిని కలిగించిందన్నారు. మేఘుడు జాతీయ సమగ్రతను భారతదేశ సమగ్ర దర్శనం జీవనదుల సంధానం, ప్రకృతి పట్ల ప్రేమను తెలియజేస్తుందన్నారు. మరొక వక్త ప్రముఖ సాహితివేత్త సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అభిజ్ఞాన శాకుంతలం పై మాట్లాడుతూ మానవ జీవన విధానానికి దర్పణం వంటిదన్నారు. ఆశ్రమంలో జరిగిన చిన్న సన్నివేశం మానవజాతికి గొప్ప ఉదేశం చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్కృత పండితులు పత్రి వేణుగోపాల్, సీహెచ్. దేవేంద్ర గుప్త, డాక్టర్ అన్నదానం అంజనీ కుమార్, డాక్టర్ బాపట్ల ఫణికామేశ్వరి, మాదిరాజు సుకన్య, అప్పరాజు ఉదయకిరణ్, బలరామకృష్ణశర్మ, నారసాని చిరంజీవి, డాక్టర్ కోలా సుబ్బారావు, శాయి సులోచన, రజనీ చందు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి