ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కాళిదాసు కావ్యాలు సంస్కృత సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి - ఎస్.ఎస్. వి. లక్ష్మీనారాయణ - 20.11.2026

కాళిదాసు   కావ్యాలు సంస్కృత సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి   మహాకవి కాళిదాసు రచించిన కావ్యాలు సంస్కృత సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయని సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. వి. లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సంస్కృత భారతి నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాకవి కాళిదాసు జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు   జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్.ఎస్.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి, వేదవ్యాసుడు తరువాత అంతటి స్థానాన్ని పొందిన మహాకవి కాళిదాసు అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి మాట్లాడుతూ కాళిదాసు రచనలు జనబాహుళ్యంలో విశేష ప్రాచూర్యం పొందాయన్నారు. పార్వతీపరమేశ్వరుల వివాహం, కుమారస్వామి జననం, తారకాసుర వధ మొదలైన విషయాలు కుమార సంభవం కావ్యంలో ప్రధానంగా కనిపిస్తాయన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న శతావధాని డాక్టర్ తాతా సత్య సందీప్ శర్మ కుమారసంభవం మహాకావ్యంపై ప్రసంగిస్తూ చిన్న విషయాన్న...

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన - 15.11.2026

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై ఆది వారం రాత్రి జరిగిన బాలల నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో కాజా సత్యవతిదేవి లక్ష్మీనరసిం హారావు మెమోరియల్ బాల కళావేదిక ఆధ్వర్యంలో 17వ చిల్డ్రన్స్ డ్యాన్స్ ఒలింపియాడ్ సందర్భంగా కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్ విభాగంలో 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురిని ఎంపిక చేశారు. ఇదే వేదిక మీద శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు, విశాఖ పట్నానికి చెందిన నంబాల జ్యోతి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సభకు సంస్థ అధ్యక్షులు వెంకటే శ్వర్లు అధ్యక్షత వహిం చారు. కాజా వెంకట సుబ్ర హ్మణ్యం, ఆర్.రాము తదిత రులు పాల్గొని వెలవర్తిపాటి ఆరాధ్య శంకర్, నారా లక్ష్య, కోమలి దేవాల్ష్, కాలువ విద్వేష అన్విత, గాధావ ఝల సంహిత, వేముల నైనిక లను బాలకళారత్న పురస్కారంతో సత్కరిం చారు. కార్యక్రమాన్ని వెంక టగిరి నాగలక్ష్మి, తాళ్లూరి ధరణి పర్యవేక్షించారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అలరించిన భక్తి సంగీత విభావరి - మహతీ స్వరసుధ - 28.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - బృందావన్ గార్డెన్స్, గుంటూరు - 25.07.2026

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.