కఠోపనిషత్తుపై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం జరుగుల బంగారుబాబు, శివకుమారి గార్ల
సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ
కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలన
చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు ద్వితీయాధ్యాయం రెండవ వల్లీలో యమధర్మరాజు
నచికేతునికి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, మానవ శరీర స్వభావాన్ని, పరమాత్మ తత్త్వాన్ని సులభంగా బోధించాడన్నారు. మొదటగా ఈ శరీరాన్ని పదకొండు ద్వారాలు కలిగిన ఒక నగరంతో
పోల్చుతూ, వికారాలు లేని పరమాత్మ ఈ దేహంలో
అంతర్యామిగా నివసిస్తున్నాడని వివరిస్తాడన్నారు. అగ్ని, వాయువులు ప్రపంచమంతటా
వ్యాపించి విభిన్న రూపాలలో కనిపించినట్లే, ఏకైక అంతరాత్మ కూడా సమస్త జీవులందు ఉంటూ జగత్తుకు లోపలా వెలుపలా వ్యాపించి
ఉంటాడన్నారు. సూర్యుడు సమస్త జగత్తుకు కంటి వంటివాడై వెలుగునిస్తూ కూడా లౌకిక
దోషాలచే ఎలా అంటబడడో, పరమాత్మ కూడా జీవుల
సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడన్నారు.
.jpeg)



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి