ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆకాశదీపం ప్రారంభం - 10.11.2026

ఆకాశదీపం ప్రారంభం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా మంగళవారము ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి బృందంచే ములవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ద్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించి పూజలు నిర్వహించి ఆకాశదీపం అరోహణ గావించారు. అధిక సంఖ్యలో భక్తులు, సువాసినీలు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

అలరించిన కర్రా నాగవైష్ణవి శాస్త్రీయ సంగీత కచేరి - 07.11.2026

అలరించిన కర్రా నాగవైష్ణవి శాస్త్రీయ సంగీత కచేరి

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో  శనివారము శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి 191 వ ఆరాధన సంగీతోత్సవం సందర్బంగా సంగీత సభ జరిగింది.  తొలుత సభా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్ నల్లపాటి ప్రవీణ్ కుమార్, అతిధులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ జి. సుస్వర, ఆలయపాలక మండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సభానంతరం కర్రా నాగవైష్ణవి, చెన్నై వారి శాస్త్రీయ సంగీత గాత్ర కచేరి అభిమానులను అలరించింది. వీరికి వయోలిన్‌పై  కోట గాయత్రీ వరేణ్య, చెన్నై, మృదంగంపై టి.వి. కృష్ణవంశీ, తిరుపతి వారు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు.  నాగవైష్ణవి కచేరీలో  ముత్తుస్వామి దీక్షితులవారి కృతులను గానం చేసి అలరించారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎమ్. వై. శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి, డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, కార్యదర్శి ఏ.వి. మంగాదేవి, కోశాధికారి మాధవపెద్ది విజయలక్ష్మి, సహ కార్యదర్శి, మాధవికృష్ణ  తదితరులు విచ్చేసిన అతిథులను, కళాకారులను  ఘనంగా సత్కరించారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అలరించిన భక్తి సంగీత విభావరి - మహతీ స్వరసుధ - 28.06.2026

అలరించిన భక్తి సంగీత విభావరి బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మహతి స్వరసుధ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో మహతి స్వరసుధ అధ్యక్షురాలు పత్రి నిర్మల, పాడుతా తీయగా-2019 విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లిలను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావును సత్కరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, గుళ్లపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు - 26.06.2026

రంగస్థల కళాకారులకు బీవీ రావు ఆదర్శనీయులు రంగస్థల కళాకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బీవీ రావు ఆదర్శనీయులని పలువురు నివాళులర్పించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీజైభవాని నాట్య మండలి ఆధ్వర్యంలో బీవీ రావు కళాసేవా పుర స్కార సభ జరిగింది. సభకు రంగస్థల ప్రముఖుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, జైభవాని నాట్యమండలి అధ్యక్షుడు అయితి వాసు దేవశర్మ, ఆర్కిటెక్ట్ బి. శ్రీనివాస్ తదితరులు బీవీ రావు వృత్తి ప్రవృత్తుల్లో కనబర్చిన నీలబద్ధత, ఆదర్శాలను వివరించారు. బి.వి.రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి రాంపిళ్ల రాజేశ్వరికి వి.ఎస్.వి.ఎస్. రోహిత్ అందించి సత్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ నరాలశెట్టి రవికుమార్ దుర్యోధన- హేమ్లెట్, శ్రీకృష్ణదేవరాయలు ఏక పాత్రలను అభినయించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్య క్షుడు పి. రామచంద్రరాజు పాల్గొన్నారు. కార్యక్రమాలను బీవీఎస్ ప్రసాద్, కావూరి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు - బృందావన్ గార్డెన్స్, గుంటూరు - 25.07.2026

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.