అలరించిన భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం వ్యవస్థాపక అధ్యక్షురాలు మహతీ స్వరసుధ పత్రి నిర్మల ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి 306 వ కార్యక్రమం జరిగింది. గాయని గాయకులు జరీనా, హారిక, ప్రసన్న లక్ష్మి, ప్రద్యుమ్న, కమల్ కిషోర్, వలి, కృష్ణప్రసాద్ లు అనేక సినీ భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించి అభిమానులను అలరించారు. వీరికి కీబోర్డ్ పై కే.రవిబాబు, తబలా ఎస్.వెంకట్, పాడ్స్ కే.చంద్ర చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. గౌరవ అతిధులుగా హైకోర్ట్ అడ్వకేట్ శశాంక భువనగిరి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ.వీ.కే. సుజాత వ్యాఖ్యానంతో, కె. మదన్మోహన్ కార్యక్రమాలను నిర్వహించారు. సంస్థ వారు అతిధులను, కళాకారులను ఘనంగా సత్కరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి