అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
అలరించిన అన్నమాచార్య అష్టోత్తర శతసభాగాన సంకీర్తన
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై అన్నమాచార్య
సంకీర్తన స్వరవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్, సహృదయ ఆర్ఫనేజ్ హోమ్ ఫర్ ఆల్ వారి
ఆధ్వర్యంలో శనివారం అన్నమాచార్య అష్టోత్తర శతసభాగాన సంకీర్తనల గాన కార్యక్రమం
జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయకార్యదర్శి ఊటుకూరి
నాగేశ్వరరావు, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గాయకులు కోటపాటి వెంకటేశ్వర్లు, శ్రీయ, హరిణీ, గగన్ సాయి, జయలక్ష్మిలు తమ
గాత్రధారణలో అదిగో కొలువైయున్నాడే, అంచులోకములెల్లా నీరజాక్షుడా, వేంకటాచాల
సమస్థానం, కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వారు అంటూ పలు అన్నమాచార్య కీర్తనలను
శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కీబోర్డుపై యం.కె. జగదీష్, తబల-ప్యాడ్స్ పై యం.కె.
సోమశేఖర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి