సేవాకార్యక్రమాలకు స్పందించిన దాతలు
గుంటూరు బృందావన్ గార్డెన్స్ నందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ అనుబంధ సంస్థ, అనేక మానవతా కార్యక్రమములు నిర్వహిస్తున్న శ్రీ అన్నమయ్య సేవాసమితి చేపట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పూర్తి చేయుట మరియు అవసాన దశలో ఉన్నవారిని ఆదరించే అంతర్యామి నిర్మాణాలకు దాతలు విశేషంగా స్పందించారు. కమిటి సభ్యులు, అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయ వ్యవస్థాపకులు, గ్రంథాళ్వార్ లంకా సూర్యనారాయణ గారి కుటుంబసభ్యులు 50 లక్షల భూరి విరాళం సమర్పించారు. ప్రముఖ వైద్యులు, అనేక విద్యాసంస్థల నిర్వహణలో భాగస్వామి డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య గారు 10 లక్షలు విరాళంగా అందించినట్లు దేవాలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలిపారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి