అలరించిన అన్నమయ్య గానామృతం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు నాగార్జున సంగీత నృత్య పాఠశాల మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్ట్ వారి సంయుక్త నిర్వహణలో అన్నమయ్య గానామృతం కార్యక్రమం ప్రేక్షకులను అకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్. శ్యామ్ కుమార్ తమ గాత్ర ధారణలో నీలమేఘశ్యాములే అలమేలుమంగమ్మ, సర్వేశ్వర, సర్వేశ్వర, కొండమీదకెక్కినట్టి గోవింద అంటూ పలు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి తబలపై ఎన్. విద్యాధర్, కీబోర్డుపై కె. కుప్పస్వామి, ప్లూట్ పై ఎం.కె. కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. ముఖ్యఅతిధులు అసిస్టెంట్ కన్షర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఏ.పి. పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమాలను డాక్టర్ కె. సూర్యనారాయణ పర్యవేక్షించారు.
రెండవ రోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న జగన్మాత - శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం, బృందావన్ గార్డెన్స్ గుంటూరు





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి