ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన అన్నమయ్య గానామృతం - 12.10.2026

అలరించిన అన్నమయ్య గానామృతం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై   సోమవారం నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు నాగార్జున సంగీత నృత్య పాఠశాల మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్ట్ వారి సంయుక్త నిర్వహణలో అన్నమయ్య గానామృతం కార్యక్రమం ప్రేక్షకులను అకట్టుకుంది.   తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్. శ్యామ్ కుమార్ తమ గాత్ర ధారణలో నీలమేఘశ్యాములే అలమేలుమంగమ్మ, సర్వేశ్వర, సర్వేశ్వర, కొండమీదకెక్కినట్టి గోవింద అంటూ   పలు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి తబలపై ఎన్. విద్యాధర్, కీబోర్డుపై కె. కుప్పస్వామి, ప్లూట్ పై ఎం.కె. కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. ముఖ్యఅతిధులు అసిస్టెంట్ కన్షర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఏ.పి. పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.   కార్యక్రమాలను డాక్టర్ కె. సూర్యనారాయణ పర్యవేక్షించారు. రెండవ రోజు  గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న జగన్మాత - శ్రీ వేంకటేశ్వరస్వ...

ఆకట్టుకున్న హాసిని ప్రవీణ నృత్య అభినయనం - 11.10.2026

ఆకట్టుకున్న హాసిని ప్రవీణ నృత్య అభినయనం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాధా మాధవ రసంజని నిర్వహణలో రాధా మాధవ నాట్య క్షేత్రం నాట్యాచార్య ఎస్. కే. ఖలీల్ శిష్యురాలు ముద్ర బోయిన హాసిని ప్రవీణ ఆరంగేట్రం సందర్భంగా ఆదివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను సమ్మోహపరిచింది. ఈ సందర్భంగా జరిగిన సభకు నాట్యాచార్య ఎస్.కె. ఖలీల్ అధ్యక్షత వహించారు. ఆధితులుగా  ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు, కన్నా స్కూల్స్ డైరెక్టర్ కన్నా మాస్టారు శ్రీ లలిత స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ లలిత సింధూరి,నాట్య సన్నిధాలయ వ్యవస్థాపక డైరెక్టర్ సన్నిధ రాజసాగి  తదితరులు పాల్గొని హాసిని ప్రవీణ ను అభినందించారు. ముద్ర బోయిన హాసిని ప్రవీణ రంగ పూజ, నటరాజు పూజ నిర్వహించి అనంతరం గణపతి తాళం, జయము జయము, కస్తూరి రంగ రంగా తిల్లానా, ప్రహ్లాద పట్టాభిషేకం శబ్దం తదితర కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఆహుతులను పరవశింపజేశారు. నట్టు వాంగం, నృత్య దర్శకత్వం నాట్యాచార్య ఎస్.కే.ఖలీల్, నేపద్యగానం దండిబోట్ల శ్రీనివాస వెంకటశాస్త్రి, బెజవాడ భువనేశ్వరి, మృదంగం పై నేరెళ్ల ఫణి కుమార్, వీడియోలు పై పాలపర్తి ఆంజనేయులు వీణపై కొండా శశిధర్ తబలాపై పాలుట్ల బాలాజీలు వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమానికి వంగిపురపు శారదా దేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


మొదటి రోజు బాలాత్రిపురసుందరీదేవి అలంకరణ - శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు













కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు - 08.11.2025

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.