అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
కఠోపనిషత్ పై ప్రవచనము
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై సోమవారం
బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక
ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు రెండవ అధ్యాయం, తృతీయ వల్లీలో పరమాత్మ
ఉన్నాడు అనే నిశ్చయాత్మక విశ్వాసంతో సాధన ప్రారంభించినప్పుడే ఆ పరబ్రహ్మ
నిజస్వరూపం అనుభవంలోకి వస్తుందని యముడు తెలుపుతాడన్నారు. ఆ తర్వాత, హృదయంలోని సమస్త కోరికలు
మరియు అజ్ఞాన బంధాలు జీవించి ఉన్నప్పుడే తొలగిపోతే, మరణించే స్వభావం ఉన్న మానవుడు ఇక్కడే అమరత్వాన్ని
సాధించి బ్రహ్మత్వాన్ని పొందుతాడని స్పష్టం చేస్తాడన్నారు. హృదయానికి ఉండే 101
నాడులలో శిరస్సు వైపు వెళ్లే సుషుమ్నా నాడి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, మరణ సమయంలో ఈ నాడి ద్వారా పయనించినవాడు అమరత్వాన్ని
పొందుతాడన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి