ఆకట్టుకున్న వాగ్గేయకార కళావైభవం సంగీత రూపకం
స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ
వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి
ప్రధాన కార్యదర్శి ఎమ్.వై.శేషురాణి ఆధ్వర్యంలో వాగ్గేయకార మహోత్సవాలు అక్టోబర్ 3,4వ తేదీలలో
నిర్వహిస్తున్న క్రమంలో శనివారం ఉదయం
తొమ్మిది గంటలకు స్థానిక విద్వాంసులచే వాగ్గేయకార కృతులను శ్రావ్యంగా గానం
చేశారు. సాయంత్రం కార్యక్రమాలను కొంపల్లి లక్ష్మి అన్నపూర్ణమ్మ, కోటేశ్వరరావు
దంపతులు, ముఖ్య
అతిధి గౌరవ విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్
హైకోర్ట్ ఎ.వి.
శేషసాయి, గౌరవ
అతిధి ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాస్, ఆత్మీయ
అతిధి కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య,
సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్బంగా
సభా కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వైణిక చక్రవర్తి, డీ. శ్రీనివాస్, (హైదరాబాద్)
వారిని ఘనంగా సత్కరించి గౌరవించారు. ముఖ్యఅతిధి మాట్లాడుతూ సంగీతం మనఃశాంతికి, మనోల్లాసానికి
దోహదం చేస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న గాయత్రీ మహిళా
సంగీత సన్మండలి వారిని అభినందించారు. అనంతరం డి. శ్రీనివాస్ శాస్త్రీయ సంగీత వీణ కచేరీ జరిగింది . డి. శ్రీనివాస్ అనేక వాగ్గేయకార కీర్తనలను వీణ పై మ్రోగించి
అభిమానులను మంత్ర ముగ్ధులను చేశారు. వీరికి వయోలిన్ పై వాయులీన నాద కిశోరం మావుడూరు
సత్యనారాయణ, శ్రీకాకుళం, మృదంగ సుధాకర
సద్గురు చరణ్,
విజయవాడ, ఘటం ఏం
చంద్రకాంత్, హైదరాబాద్
వారు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన
కార్యదర్శి ఏం. వై. శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి, డాక్టర్
రాజరాజేశ్వరి,
పాటిబండ లలిత, కార్యదర్శి ఏ.వి.మంగాదేవి, కోశాధికారి
మాధవపెద్ది విజయలక్ష్మి అతిధులను, కళాకారులను సత్కరించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ
ఆంధ్రుడిగా పుట్టడం, తెలుగు భాష మాతృభాషగా పొందడం మనం చేసుకున్న ఎంతో
అదృష్టమన్నారు. కళాకారులు అల్పసంతోషులనీ, సంగీతానికి రాళ్ళను కరిగించే శక్తి
ఉంటుందన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి