ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కఠోపనిషత్ పై ప్రవచనము - సువీరానందస్వామి, చిన్మయమిషన్ - 05-09.10.2026

కఠోపనిషత్ పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ కఠోపనిషత్తు రెండవ అధ్యాయం , తృతీయ వల్లీలో పరమాత్మ ఉన్నాడు అనే నిశ్చయాత్మక విశ్వాసంతో సాధన ప్రారంభించినప్పుడే ఆ పరబ్రహ్మ నిజస్వరూపం అనుభవంలోకి వస్తుందని యముడు తెలుపుతాడన్నారు. ఆ తర్వాత , హృదయంలోని సమస్త కోరికలు మరియు అజ్ఞాన బంధాలు జీవించి ఉన్నప్పుడే తొలగిపోతే , మరణించే స్వభావం ఉన్న మానవుడు ఇక్కడే అమరత్వాన్ని సాధించి బ్రహ్మత్వాన్ని పొందుతాడని స్పష్టం చేస్తాడన్నారు. హృదయానికి ఉండే 101 నాడులలో శిరస్సు వైపు వెళ్లే సుషుమ్నా నాడి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ , మరణ సమయంలో ఈ నాడి ద్వారా పయనించినవాడు అమరత్వాన్ని పొందుతాడన్నారు.

ఆకట్టుకున్న సంగీత కదంబ కార్యక్రమము - 01.10.2026

ఆకట్టుకున్న సంగీత కదంబ కార్యక్రమము

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం సాయిశృతి మ్యూజిక్ అకాడమీ ఆర్. ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో సంగీత కదంబ కార్య్రకమము. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం యువకళాకారులచే గాత్రం, వయోలిన్, కీబోర్డు, తబల, డ్రమ్స్, వీణా, మృదంగంతో పాటు 12 వివిధ రకాల వాయిద్యలలో ఆర్. ప్రేమ్ కుమార్ వద్ద శిక్షణ పొందిన విద్యార్దినీ, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభతో కళాభిమానులను అలరించారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు - 08.11.2025

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.