సుందరకాండ సుందరమైనది
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం సుందరకాండ సుందరమైనది ఎందుకు? అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాషాప్రవీణ నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రవచిస్తూ రామాయణంలో సుందరకాండ అత్యంత శుభప్రదమైనది, ఆశాజనకమైనదన్నారు. సుందర అంటే కేవలం అందమే కాక మంగళం, విజయం అని కూడా అర్థమన్నారు. నిరాశలో ఉన్న రాముడికి హనుమంతుడు సీతాదేవి ఆచూకీని కనుగొని చూశాను సీతను అనే దివ్యమైన వార్తను అందించడం ఈ కాండలోని ప్రధాన ఘట్టమన్నారు. హనుమంతుని అద్భుత పరాక్రమం, నిశ్చలమైన రామానుగ్రహ భక్తి, మనోహరమైన కావ్య వర్ణనలు మరియు చదివేవారికి ధైర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించే శుభ పరిణామాలు నిండి ఉండటం వల్లే ఇది నిజంగా సుందరమైనదిగా నిలిచిందన్నారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి