రవికిరణ్ కు అయ్యంగార్ అవార్డు ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ 111వ జయంతి మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా పురస్కార ప్రదానోత్సవం, శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహిం చారు. తొలుత కార్యక్రమాన్ని డాక్టర్ లలిత్ ప్రకాష్ చంద్రజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్య అతిథి డాక్టర్ బి. విజయభాస్కర్, గౌరవ అతిథులు వింజమూరి సంధ్య (చెన్నై), ఆలయ కమిటీ అధ్య క్షుడు సీహెచ్ మస్తానయ్య పాల్గొని డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ సంగీత సేవలను కొనియాడారు. అనంతరం జి.రవికిరణ్ కు డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ అవా ర్డును ప్రదానం చేసి సత్కరించారు. సభ అనంతరం రవికిరణ్ శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ నిర్వహించి త్యాగరాజు తదితర వాగ్గేయ కారుల కృతులను ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షులు మాధవపెద్ది మీనాక్షి డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, కార్యదర్శి ఎ.వి. మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి