ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రమణీయ వర్ణన నిది శృంగారనైషధం - డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి - 06,07.07.2026

రమణీయ వర్ణన నిది శృంగారనైషధం రమణీయ వర్ణన నిది శృంగారనైషధం అని డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శృంగార నైషధంపై ప్రసంగించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరంగనాయకి మాట్లాడుతూ నైషధీయ చరితంలో నలుడిపై దమయంతి మనసుపడి, అతని విరహవేదనతో బాధపడుతున్నప్పుడు. చంద్రుడిని, మన్మథుడిని నిందించే ఘట్టంలోని వర్ణనలు రమణీయమైనవన్నారు. లోకానికి శీతలత్వాన్ని, ఆనందాన్ని పంచే చంద్రుడు మాత్రం నిప్పులు కురిపిస్తున్నాడని, విరహాన్ని రెట్టింపు చేస్తున్నాడని దమయంతి వాపోతుందన్నారు.

రమణీయ వర్ణన నిది శృంగారనైషధం - డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి - 06,07.07.2026

రమణీయ వర్ణన నిది శృంగారనైషధం

రమణీయ వర్ణన నిది శృంగారనైషధం అని డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శృంగార నైషధంపై ప్రసంగించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరంగనాయకి మాట్లాడుతూ నైషధీయ చరితంలో నలుడిపై దమయంతి మనసుపడి, అతని విరహవేదనతో బాధపడుతున్నప్పుడు. చంద్రుడిని, మన్మథుడిని నిందించే ఘట్టంలోని వర్ణనలు రమణీయమైనవన్నారు. లోకానికి శీతలత్వాన్ని, ఆనందాన్ని పంచే చంద్రుడు మాత్రం నిప్పులు కురిపిస్తున్నాడని, విరహాన్ని రెట్టింపు చేస్తున్నాడని దమయంతి వాపోతుందన్నారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.