అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము
స్థానిక బృందావన్
గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం
శ్రీమద్భగవద్గీత_ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు
సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి
ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత
ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి
ఉపనిషన్మందిరం, శ్రీకాకుళం
సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి
శ్రేష్టః...., అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు
ఏ విధముగా స్ఫూర్తిదాయకము, ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల
ప్రస్తావనను వక్త వివరించారు. ప్రధానంగా
విద్యార్థులు, యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు
అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు. వక్తను
కార్యవర్గ సభ్యులు అభినందించి, సత్కరించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి