శ్రీమద్భగవద్గీత పై ప్రవచనము స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత _ నేటి సమాజానికి ఆవశ్యకత పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీమద్భగవద్గీత ను భారతంలో అందించిన వ్యాసుల వారి గురించి ఉపనిషన్మందిరం , శ్రీకాకుళం సభ్యులు బ్రహ్మశ్రీ నిష్ఠల శ్రీ నరసింహమూర్తి గారు స్మరణ చేస్తూ యద్య దాచరతి శ్రేష్టః.... , అసంశయం మహాబాహో..... తద్విద్ధి ప్రణిపాతేన... మొదలగు శ్లోకములు నేటి సమాజమునకు ఏ విధముగా స్ఫూర్తిదాయకము , ఈ శ్లోకముల నుండి స్ఫూర్తి పొందిన కొందరి ప్రముఖుల ప్రస్తావనను వక్త వివరించారు. ప్రధానంగా విద్యార్థులు , యువత ఈ శ్లోకముల ద్వారా ఏ విధమైన స్ఫూర్తిని పొంది జీవితంలో ఉన్నత స్థానములు అధిరోహించవచ్చును అనే వివరణ తెలియజేశారు. వక్తను కార్యవర్గ సభ్యులు అభినందించి , సత్కరించారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 11మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి