అలరించిన మహిళా సీనియర్ సిటిజన్స్ కదంబ కార్యక్రమం
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి కదంబ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీమతి వంకాయలపాటి హనుమాయమ్మ సభాధ్యక్షురాలు సమక్షంలో శ్రీమతి ఝాన్సీలక్ష్మీబాయి ఏకపాత్రాభినయానికి ప్రేక్షకులు అభినందించారు. మహిళా విభాగం సీనియర్ సభ్యురాలు శ్రీమతి వై.ఎస్. రాజ్యం గారు తమ అలనాటి చలనచిత్రగీతాలు ఆలపించి ప్రముఖ గాయని శ్రీమతి భానుమతిని స్మరింపజేశారు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలు - ధారావాహిక కార్యక్రమంలో భాగంగా కంచి కామాక్షి శక్తిపీఠం విశేషాలు సోదాహరణంగా వివరించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారిగారి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవాలయ పాలక మండలి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి శ్రీ ఊటుకూరి నాగేశ్వరరావు గార్లు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. ఆలయ కమిటి వారు గౌరవాధ్యక్షురాలు, సేవావిశారద శ్రీమతి గద్దె రామతులశమ్మ గారు సభ నడిపించిన మహిళా విభాగం అనేక వైవిధ్య కార్యక్రమాలు నిర్వహించటం ముదావహం అని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో డా॥ మాధవపెద్ది విజయలక్ష్మి, డా॥ అంబటి విజయలక్ష్మి, చందు హనుమాయమ్మ తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థన గీతం ఆలపించిన దేదీప్యను అతిథులను శాలువతో సత్కరించారు.

.jpeg)
.jpeg)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి