ఆకట్టుకున్న తెలుగుతల్లి నృత్య రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభకు ప్రముఖ హరి కథకులు ముప్పవరపు సింహాచల శాస్త్రి విచ్చేశారు. కళారత్న డాక్టర్ కాజ సుబ్రహ్మణ్యం నృత్య దర్శకత్వం, సూత్ర దారిత్వలో కోకా విమల కుమారి రచించిన తెలుగు తల్లి" నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి