ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
స్థానిక బృందావన్ గార్డెన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న శ్రీసాయి మంజీరా కూచి పూడి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ నృత్య దినోత్సవం నాలుగో రోజుకు చేరుకుంది. ఆదివారం కార్యక్రమాల్ని ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు ప్రారంభించారు. అనంతరం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఉన్ని కృష్ణన్- మోహిన అట్టం, కాసర వల్లి క్షితిజ-భారతనాట్యం, జార్ఖండ్ చెందిన తరిత్ సర్కార్ కథక్, మణిపూర్కు చెందిన గోపాల్సింగ్-మణిపూరి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సంస్థ కార్యదర్శి డాక్టర్ ఖాజ వేంకట సుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలను సంస్థ కోశాధికారి వెంకటగిరి నాగలక్ష్మి, నారా రాధిక పర్యవేక్షించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి