అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
రావణ వధను ముందే గ్రహించిన లంకిణి
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం. అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో మంగళవారం సుందరకాండ మూడు అధ్యాయం పారాయణం జరిగింది. ఎం.ఎస్.రామారావు రచించిన సుందరకాండలోని మూడో అధ్యాయంలోని శ్లోకాలను వెంపటి సత్యనారాయణ తమ గాత్రధారణలో చక్కగా ఆలపించి భావం వివరించగా, ప్రముఖ కవి మల్లేశ్వరరావు విశ్లేషణ చేశారు.
.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి