అలరించిన ఉత్తర గోగ్రహణం తోలుబొమ్మలాట
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై గురువారం రాత్రి ఉత్తర గోగ్రహణం తోలు బొమ్మలాట ప్రదర్శించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో శ్రీషిర్డీసాయి తోలుబొమ్మలాట బృందం (నరసరావుపేట) కళాకారులు నిర్వహించగా, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. దుర్గారావు, కుమారి, వెంకటదాసు, నాగేశ్వరరావు, చిన్న, కోటేశ్వరి, సీతమ్మ, హనుమంతరావు, శివరా మకష్ణ, కమల్ బృందం మహాభారతంలోని పాండ వుల అజ్ఞాతవాసం, బృహన్నల నాట్య గురుత్వం, కౌరవుల కుట్ర, ఉత్తర కుమారుని ప్రజ్ఞలు, ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవులను అర్జునుడు ఒక్కడే ఓడించడం తదితర ఘట్టాలను పద్యాలు, గేయాలు, వచనంతో ప్రదర్శించారు. ప్రేక్షకులను అలరించాయి. అనంతరం కళాకారులను గుళ్లపల్లి రాఘవేంద్రరావు సత్కరించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి