సందేశాత్మకంగా సాగిన ఇది అతని సంతకం నాటిక స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఈశ్వర వరప్రసాద్ పరిషత్ నిర్వహణలో సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్ స్మత్యర్ధం శుక్రవారం అభినయ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటకం సందేశాత్మకంగా సాగింది. తొలుత సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలచందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాల్ళర్పించారు. కృష్ణమూర్తి అబద్ధం లేని జీవితాన్ని గడిపాడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణించాడు. వేసిన ప్రతి అడుగులోను ప్రత్యేకతను చాటుకొన్నాడు. జీవితపు చరమాంకంలో దంపతులు ఎలా బతకాలో ప్రణాళిక రచించుకొన్నాడు. ఆ ఆలోచనను నిజం చేసుకొన్నాడు. బతికే విధానాన్ని చిత్రించుకొని సంతకం చేసుకొన్నాడు. అందుకే అభినయ ఆర్ట్స్ స్నిగ్ధ రచనకు, యన్. రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఇది అతని సంతకం నాటికను ప్రదర్శించారు. ఇందులో యన్. రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె. ప్రసాద్, యన్. సూర్య, ట...
వైభవంగా కూడారై ఉత్సవం
స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తితిదే, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రాత్రి కూడారై ఉత్సవం వైభవంగా జరిగింది. సంస్కృత పండితుడు కేవీఎల్ఎన్ అప్పలాచార్యులు తిరుప్పావైలోని 28వ పాశురం కూడారై వెల్లుమ్జీశీర్ గోవిందా గురించి వివరించారు. సాహితీవేత్త డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి నేతృత్వంలో గోదా అమ్మవారికి పూజలు నిర్వహించారు.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి