అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
పాదుకా పట్టాభిషేకంపై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై పచ్చిపులుసు రామకుమారి గారి జ్ఞాపకార్ధం భర్త పచ్చిపులుసు రాఘవరావుగారు మరియు కుటుంబసభ్యుల సౌజన్యంతో పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాల పంపిణి చేశారు. అనంతరం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిచే పాదుక పట్టాభిషేకం ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం జరిగింది.
.jpeg)
.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి